ఆధునిక పోలీసింగ్‌పై డీఐజీ అంబర్ కిశోర్ ఝా సూచనలు
ప్రజా భద్రతే పోలీసుల ప్రథమ కర్తవ్యమని వెల్లడి
మల్హర్ , ఆగస్టు 20 (చక్రవాణి న్యూస్) :
వార్షిక తనిఖీల్లో భాగంగా కాళేశ్వరం జోన్ డీఐజీ అంబర్ కిశోర్ ఝా కొయ్యూరు పోలీస్ స్టేషన్‌ను సమగ్రంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ డిఐజీకి స్వాగతం పలికారు.
పోలీస్ స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, ఆయుధాగారం, సిబ్బంది పనితీరును డీఐజీ క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాల పనితీరుపై ఆరా తీశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తూ నేరాల నియంత్రణకు మరింత సమర్థవంతంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పోలీస్ సేవలు అందించడం ప్రతి పోలీస్ అధికారి బాధ్యత అని డీఐజీ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. ప్రజా భద్రతే పోలీసుల ప్రథమ కర్తవ్యం కావాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్, నిఘా పెట్రోలింగ్, కమ్యూనిటీ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
సాంకేతికతతో నేరాల నియంత్రణ
మారుతున్న కాలానికి అనుగుణంగా సీసీటీఎన్ఎస్ 2.0, ఈ-సాక్ష్య, డిజిటల్ ఫోరెన్సిక్స్, సైబర్ దర్యాప్తు వంటి ఆధునిక విధానాల్లో సిబ్బంది నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలు, రౌడీషీటర్లపై నిరంతర నిఘా ఉంచుతూ నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం
పర్యావరణ పరిరక్షణలో భాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో డీఐజీ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ నాగర్జునరావు, మహదేవపూర్ సీఐ వెంకటేశ్వర్లు, కొయ్యూరు ఎస్ఐ మహేందర్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం


0 Comments